water

చలికాలంలో చాలామంది తక్కువ నీరు తాగుతూ ఉంటారు. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు రావడం వల్ల నీటిని తక్కువ తాగుతూ ఉంటారు. అయితే మన శరీరంలో నీరు తక్కువగా ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఎముకలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి పెరుగుతాయి. తక్కువ నీళ్లు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్లనొప్పులు- శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల కీళ్లలో ఉండే ద్రవం తగ్గుతుంది. ఇది ఎముకల మధ్య ఘర్షణను ఏర్పడేలాగా చేస్తుంది. అది కీళ్లలో నొప్పి వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ఆర్థరైటి సమస్యతో బాధపడేవారు చల్లటి వాతావరణం లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

కాళ్లలో తిమ్మిర్లు- మన శరీరంలో నీరు తగ్గినప్పుడు అవసరమైన పోషకాలు మన కండరాలకు చేరవు ఫలితంగా నొప్పులు ఏర్పడతాయి. అంతేకాకుండా కాళ్లల్లో తిమ్మిరి బలహీనంగా ఉండడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనికి తగినంత నీరు తీసుకోవడం వల్ల కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

Health Tips: ప్రతిరోజు బీట్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...

తలనొప్పి- మన శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ మరియు పోషకాహారం అందదు. దీనివల్ల తలనొప్పి ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

గుండె సమస్యలు- మన శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల గుండె పైన కూడా ప్రభావాన్ని చూపుతుంది. నెమ్మదిగా రక్తప్రసరణలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది రక్తపోటుకు దారితీస్తుంది. ఇది గుండెపైన ఒత్తిడిని కలిగిస్తుంది అనేక రకాల ఇన్ఫెక్షన్లను ఏర్పడుతుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ప్రోస్టేట్ ,మూత్ర సంబంధ సమస్యలను కూడా పెంచుతుంది.

తగినంత నీరు తీసుకోవాలి- చలికాలంలో కూడా కనీసం రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. దీని వల్ల మన శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. ఒకవేళ మీరు నీటిని తాగనేనట్లయితే సూపు హెర్బల్టి మజ్జిగ లాంటి వాటిని తీసుకోవచ్చు. శరీరాన్ని ఎప్పుడు కూడా హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి