మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్ల పైన కాస్త శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారమే అనేక రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది. అటువంటివి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మనం ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మనకు అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. ఈరోజు మనం ఒక ఐదు సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
ఆకుకూరలు- ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, సి, కె, ఐరన్, క్యాల్షియం ఫాస్పరస్, పొటాషియం వంటి అధికంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు తీసుకోవడం ద్వారా మనము గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ఇది చక్కటి ఫుడ్ అని చెప్పవచ్చు.
అవకాడో- అవకాడలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ b6 ,అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ క్రియల్లో సహాయపడుతుంది కొలెస్ట్రాలను తగ్గిస్తుంది.
డ్రై ఫ్రూట్స్- డ్రై ఫ్రూట్స్ లో బాదం, అవిస గింజలు, వాల్నట్, పిస్తా వంటి వాటిలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ఫైబర్ ,మెగ్నీషియం ,విటమిన్ ఈ వంటివి పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు మీరు ఆహారంలో ఈ డ్రై ఫ్రూట్స్ భాగం చేసుకున్నట్లయితే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బీపీ సమస్యలు కూడా తగ్గుతాయి. తద్వారా గుండెకు చాలా మేలు జరుగుతుంది.
Health Tips: గర్భధారణ సమయంలో శృంగారం చేయడం ఎంతవరకు సురక్షితం ...
స్వీట్ పొటాటో- చిలకడదుంపలు అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బీటా కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ b6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ అధికంగా ఉండడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధులను రాకుండా చేస్తుంది. షుగర్ లెవెల్ లను కంట్రోల్ చేస్తుంది.
పెరుగు- పెరుగును మనం ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ప్రోబయాటిక్ గా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి 12 వంటివి అధికంగా ఉంటాయి. పెరుగును తీసుకోవడం ద్వారా మన జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. అంటే కాకుండా ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. మలబద్ధకం సమస్య కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడే వారికి పేరు ఒక అద్భుత వరమని చెప్పవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.