మారుతున్న వాతావరణంలో అనేక రకాల సీజన్ల వ్యాధులు వస్తూ ఉంటాయి. అటువంటి అప్పుడు నిమ్మరసం మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మ రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదంలో తగ్గిస్తుంది. సీజనల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల జలుబు దగ్గు కామెర్లు ఫ్లూ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. మనము ప్రతిరోజు మన ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోవడం వల్ల ఈ వీటన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వీటిలో ఉన్న ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇమ్యూనిటీని పెంచుతుంది- నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలోపేత అవడం వల్ల మనకు సీజనల్గా వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడతాము. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి సి విటమిన్ చాలా అవసరం ముఖ్యంగా చలికాలంలో నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.
కంటి చూపు మెరుగు పడుతుంది- ప్రతిరోజు నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల నిమ్మకాయలో విటమిన్ సి తో పాటు ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్ళకు చాలా మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చూపులు మెరుగుపరుస్తాయి. దీన్ని తీసుకోవడం ద్వారా కళ్ళకు కూడా మేలు జరుగుతుంది.
గుండెకు మంచిది- నిమ్మకాయలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది ఇది రక్త పోటును తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉండడం ద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది నిమ్మకాయలో ఫైబర్ కూడా ఉంటుంది ఇది మన గుండె ఆరోగ్యాన్ని కడుపులో ఉన్న అనేక రకాల జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి