గుండె శరీరంలో ఎంత ముఖ్యమైన భాగమో అందరికీ తెలిసిందే.. శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసే ముఖ్య అవయవం గుండె. ప్రస్తుత కాలంలో గుండె సమస్యలతో ఇబ్బందిపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అలాంటి గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకుగాను ఇప్పుడు చెప్పుకోబోయే రసాలను తాగడం వలన గుండెకి చాలా మేలు జరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం..
బీట్‌రూట్ రసాన్ని తాగడం వలన హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోను అదేవిధంగా రక్తపోటును తగ్గించడమే కాకుండా రక్తప్రసరణను పెంచుతుంది.
క్రాన్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్ లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి ఇవి పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తాయి. దానిమ్మ రసం తాగడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టకుండా.. నరాల ప్రేరణకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్దిగా ఉంటుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
ఫైబర్ అధికంగా ఉండే నారింజ జీర్ణవ్యవస్థలో ఉండే కొలెస్ట్రాల్ ను గ్రహించకుండా దానిని నిరోధించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టమాట రసంను ప్రతిరోజు తాగితే హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.