cold cough remedies| Pic: Pixabay

చలికాలం వస్తుందంటే చాలు పిల్లలలో ,పెద్దల్లో కూడా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. జలుబు దగ్గు వంటి వంటివి రావడానికి కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ సంక్రమణ- మారుతున్న వాతావరణ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ లో సీజనల్ వ్యాధుల ప్రమాదం రోజురోజుకు పెరుగుతుంది. చలికాలంలో ఈ సమస్య మరింతగా ఉంటుంది. పిల్లల్లో జలుబు. దగ్గు. జ్వరం వంటివి రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాలుష్యం పెరగడము వాతావరణంలో ప్రతికూలత వల్ల ఈ సమస్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: అవిస గింజల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా ...

దగ్గుకు కారణాలు- చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడం కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఈ కణాలు శ్వాస కోసం ఊపిరితిత్తుల్లో చేరుకుంటాయి. దీని ద్వారా శేషము అనేది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లల్లో తరచుగా దగ్గు అనే సమస్య ఏర్పడుతుంది..

పిల్లల్లో తరచుగా రావడానికి కారణాలు- వాతావరణం లో మార్పు ఉదయం, సాయంత్రం, పూట చలిగాలులు పగటివేలలో వేడి వల్ల వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల శరీరము పిల్లలలో అనుకూలించకపోవడం వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. పిల్లలు జలుబు దగ్గు సమస్య వీటి కారణంగా పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాలల్లో వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్లు పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల నుండి కూడా ఈ సంక్రమణ వస్తుంది. కాబట్టి పిల్లలను ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ పెరిగే విధంగా వారికి ఆకుకూరలు పండ్లు వంటివి ఇవ్వాలి అంతే కాకుండా వారిని పెద్దవాళ్లకు జలుబు, దగ్గు ఉన్నట్లయితే వారిని కాస్త దూరంగా ఉంచడం మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి