ప్రతి వ్యక్తి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైన భాగం నిద్ర సరిగ్గా లేనప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. అయితే నిద్రపోయే ముందు మనం తీసుకునే ఆహారానికి నిద్రకు చాలా సంబంధం ఉంది. నిద్రపోయే ముందు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని ఆహారాలు ,కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అయితే చాలామంది ఈ విషయాలు తెలియక రాత్రి పూట కొన్ని ఆహార పదార్థాలను తింటారు. వాటిని తీసుకోకుండా ఉంటేనే ఉత్తమం ఆహార పదార్థాలు ఆ పానీయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ- రాత్రి పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ కూడా తాగకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే అందులో ఎక్కువ మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్రను రాణి కూడా చేస్తుంది. దీని ద్వారా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల మరుసటి రోజు ఉదయం చాలా చిరాకుగా ఆందోళనగా అనిపిస్తుంది. కాబట్టి రాత్రి నిద్ర పోయేముందు కెఫిన్ అధికంగా ఉన్న పానీయాలను తీసుకోకూడదు.
Health Tips: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మీ శరీరంలో ఏమవుతుంది
చాక్లెట్స్- చాక్లెట్స్ స్వీట్స్ వంటి వాటిని రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. వీటిలో స్వీట్ అధికంగా ఉండడం ద్వారా నిద్రను రాకుండా చేస్తుంది. డార్క్ చాక్లెట్లో అధిక మొత్తంలో కెపిన్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో తియో బ్రోమిన్ వంటి మూలకం కూడా కలిగి ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మన నిద్రకు ఇబ్బంది ఏర్పడుతుంది. అంతేకాకుండా అధిక మోతాదులో చక్కెర తీసుకోవడం కూడా నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుంది.
సిట్రస్ పండ్లు- పడుకునే ముందు ఎట్టి పరిస్థితిలో సిట్రస్ పండ్లు అయినా నారింజ, నిమ్మ, దానిమ్మ, ద్రాక్ష వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో యాసిడ్ రిఫ్లెక్షన్ వస్తుంది. ఇది కడుపుబ్బరంగా అజీర్ణంగా ఉంచుతుంది. దీని ద్వారా మీకు నిద్ర సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇది నాడీ వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపుతుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. దీని కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.
కూల్ డ్రింక్స్- రాత్రి ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ ను ,సోడా అధికంగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో కెఫెన్ ఉంటుంది. ఇది మన శరీరానికి హానికరంగా మారుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి