బాదం సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.బాదం ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. ఇది ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది.
బాదంలో ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు అందుతాయి. భాగంలో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్ ,ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది రోగనిరోధక వ్యవస్థను బలపరిచి అనేక రకాల జబ్బులు రాకుండా చేయడంలో బాదం సహాయపడుతుంది. ప్రతిరోజు బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెకు మంచిది- బాదం లో మొనోస్యాచురేటడ్ పాలిఅన్ సచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది. చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి బాదం సహాయపడుతుంది. దీని ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
Health Tips: మీరు ప్రతిరోజు తీసుకునే ఈ ఆహారాలు విషంతో సమానం
బరువు తగ్గుతారు- బాదం లో ఫైబరు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇది కొంచెం తిన్నా కూడా కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీని ద్వారా ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మీరు మీ ఆహారంలో బాదం ను చేర్చుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.
జుట్టు ,చర్మానికి మంచిది- బాదం లో విటమిన్ ఈ, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇది మన చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు సంరక్షణ కూడా బాదం సహాయపడుతుంది.
ఇమ్యూనిటీని పెంచుతుంది- బాదం లో జింక్ సెలీనియం మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. దీని ద్వారా అనేక రకాల జబ్బుల ప్రమాదం నుండి మనం బయటపడతాము. సీజనల్ గా వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి