banana

ఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్యను ఎనీమియా అని అంటారు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. తలనొప్పి కళ్ళు తిరగడం, వికారము, ఏ పని చేయకపోవడం, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. అటువంటి వారికి ఈ పసూపు పచ్చగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటిపండు- అరటి పండ్లు అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో బి12 ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియము, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఇది తక్షణ శక్తిని అందించి శరీరాన్ని ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

Health Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా, 

గుమ్మడికాయ- గుమ్మడికాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ ఇ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి  సమస్యలను కూడా తొలగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం ద్వారా మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. మన శరీరంలో రక్తహీనత సమస్య కూడా తొలగిస్తుంది.

మొక్కజొన్న- మొక్కజొన్నలో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మన శరీరంలో రక్త వృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి 12 కూడా అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా ఎనిమియా సమస్యతో బాధపడే వారికి ఇదొక చక్కటి వరంగా చెప్పవచ్చు.

గుడ్డు పచ్చ సోన- తీసుకోవడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ బి ట్వెల్ ఉంటుంది. ఐరన్ మీకు వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి