శీతాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో పచ్చి బఠానీలు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు- పచ్చి బఠానీలు లెక్కిన్ అనే పదార్థం ఉంటుంది. దీని అధికంగా తీసుకోవడం ద్వారా జగిన వ్యవస్థ బలహీనపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి.
Health Tips: చలికాలంలో విటమిన్ డి లోపం సమస్య ఏర్పడుతుంది.
కిడ్నీ సమస్యలు- పచ్చి బఠానీలలో అధిక శాతం ప్యూరిన్ ఉంటుంది. ఇది కిడ్నీలలో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతుంది. దీని ద్వారా కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి. ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్ర సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి అధిక మొత్తంలో పచ్చిబఠానీలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. కిడ్నీ జబ్బులు ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవడం ఉత్తమం.
బరువు పెరుగుతారు- పచ్చి బఠానీలలో కార్బోహైడ్రేట్ లో అధికంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దీని అధికంగా తీసుకుంటే ఎక్కువ బరువు పెరుగుతారు.
రోజులో ఎన్ని బఠానీలు తినాలి- రోజు మొత్తంలో ఒక సాధారణ మనిషి 50 నుంచి 100 గ్రాముల కంటే ఎక్కువ పచ్చి బఠానీలు తినకూడదు. దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి.
ఎవరు తినకూడదు- కిడ్నీ సమస్యలు ఉన్నవారు అదేవిధంగా మూత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు, గ్యాస్ ,ఎసిడిటీ సమస్య ఉన్నవారు బరువు తగ్గాలి అనుకునేవారు ఎట్టి పరిస్థితుల్లో పెట్టి తినకూడదు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి