best health tips for reduce belly fat, simple tips for decrease belly fat(X0

కొలెస్ట్రాల్ సమస్య ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య చిన్న వయసులో వారిని కూడా ఇబ్బంది పెడుతుంది. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు జీవన శైలిలో మార్పుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహార వల్ల కొవ్వు అధికంగా పేరుకుపోయి సమస్యను సరైన సమయంలో మనము గుర్తించకపోతే అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. అది మన కొవ్వును తగ్గించే విధంగా సహాయపడేటట్టు చూసుకోవాల. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఈ ఆహార పదార్థాలను మానివేస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జంక్ ఫుడ్: మన కొలెస్ట్రాల్ పెరగడానికి ముఖ్య కారణం బయట తినే ఆహారాలను లో జంక్ ఫుడ్ ను అధికంగా ఇష్టపడుతుంటారు. వేయించిన ఆహారాలు జంక్ ఫుడ్ అధికంగా కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇందులో అంతే కాకుండా ప్రాసెస్ చేసిన ఫుడ్లు కూడా దూరంగా ఉంటే కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు..

స్వీట్లు, కార్బోహైడ్రేట్స్: చక్కెర కార్బోహైడ్రేట్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్రెడ్ పాస్తా కేకులు వంటివి అసలు తీసుకోకూడదు. వీటివల్ల మనకు చాలా హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెక్కరను అధికంగా తీసుకోవడం వల్ల అది కొవ్వుగా నిలువ చేసుకుంటుంది. అదే కాకుండా కూల్డ్రింక్స్ కూడా మన కొలెస్ట్రాల్ను పెరిగి పెంచే విధంగా ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం ఉత్తమం.

ఆల్కహాల్: ఆల్కహాల్ కొలెస్ట్రాల్ పెరగడంలో మొదటి స్థానంలో ఉంటుంది. దీని అధికంగా తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ ను పూర్తిగా మానివేయడం మంచిది.

ట్రాన్స్ ఫాట్స్: ట్రాన్స్ఫార్ట్స్లో కొవ్వును పెంచే గుణాలు కలిగి ఉన్నాయి. ఇది కొవ్వును పెంచి మన శరీరాన్ని ఇన్ఫర్మేషన్ బారిన పడేస్తుంది. కాబట్టి ప్రాసెస్ చేసిన బేకరీ ఐటమ్లను స్నాక్స్ అసలు తీసుకోకూడదు.

కొలెస్ట్రాల్ తగ్గడానికి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది.

తిప్పతీగ- తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ ను తగ్గించి మన గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

Health Tips: ప్రతిరోజు నారింజ పండును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల ...

పునర్నవ- పునర్నవలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మన కొలెస్ట్రాల్ని తగ్గించి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు పునర్నవను ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

త్రిఫల- ఆయుర్వేదంలో త్రిఫలకు ఒక ప్రముఖ స్థానం ఉంది. ఇది అతి శక్తివంతమైన డి టాక్సీ ఫైర్ గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలో పేర్కొన్న కొవ్వును తొలగిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో పేరుకుపోయిన మలినాలు అన్నిటిని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మిమ్మరు బరువు పెరగకుండా చేస్తుంది.

ఉసిరికాయ- ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో ఈ ఉసిరికాయ రసం అనేది సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి ఔషధంగా చెప్పవచ్చు.

దాల్చిన చెక్క- దాల్చిన చెక్క కూడా కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడిని మీరు వేడి నీటిలో కలుపుకొని ప్రతి రోజు తాగినట్లయితే కచ్చితంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

వ్యాయామం- కొలెస్ట్రా సమస్యతో బాధపడేవారు కి వ్యాయామం ఒక చక్కటి రెమిడిగా చెప్పవచ్చు. మీరు వ్యాయామం యోగ మెడిటేషన్ రన్నింగ్ వంటివి చేసినట్లయితే మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా బాగుంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.