gas

ఈ మధ్యకాలంలో చాలామందిలో ఎసిడిటీ ,గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణాలు తెలుసుకుంటే ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని తీసుకోకూడని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ ఎసిడిటీ గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా గ్యాస్ ఎసిడిటీ కడప సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. దీనివల్ల తీవ్ర ఆరోగ్య అనారోగ్య ప్రభావాలు ఏర్పడతాయి. అయితే ఖాళీ కడుపుతో మనము ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సిట్రస్ పండ్లు- ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్రస్ జాతికి చెందిన ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. వీటివల్ల కడుపులో ఆసిడ్ లెవెల్స్ పెరుగుతాయి .దీని వల్ల గుండెల్లో మంట పుల్లని త్రేల్పులు వస్తాయి. అంతేకాకుండా ఈ పండ్లు తీసుకోవడం ద్వారా పేగులపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఎసిడిక్ నేచర్ పెరిగిపోయి పేగులు అల్సర్స్ కి దారితీస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తీసుకోకూడదు.

కెఫిన్- ఖాళీ కడుపుతో కాఫీ టీ తాగడం వల్ల పొట్టలో ఎసిడిటీ సమస్య మరింతగా పెరుగుతుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది యాసిడ్ని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల గుండెల్లో మంట, గ్యాస్, అజీర్ణం ఇటువంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కాఫీ టీ తీసుకోవడం వల్ల ఆసిడ్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ కడుపుతో కాఫీ టీలకు దూరంగా ఉంటే మంచిది.

Health Tips: ఈ చెడు అలవాట్లు మీకు కిడ్నీకి హాని కలిగిస్తాయి..

ఆయిల్ ఫుడ్స్- చాలామంది ఉదయం పూట పూరి, బోండా, వంటి ఆయిల్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. ఎక్కువగా నూనె ఉన్న ఆహార పదార్థాలు ,మసాలా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల ఆసిడ్ లెవెల్ పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు మరింతగా పెరుగుతాయి. రోజంతా కూడా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ ఫుడ్స్ లో ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోకూడదు.

కూల్ డ్రింక్స్- కడుపులో గ్యాస్ ట్రబుల్ ఎసిడిటీ రావడానికి మరొక కారణాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి కూల్డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. దీని తీసుకోవడం వల్ల మీకు కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ ప్రక్రియను ఆటంకాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో కూల్డ్రింక్స్ ను తీసుకోకూడదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి