sugar

మధుమేహ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ జ్యూస్ లను తాగకూడదు.అయితే షుగర్ పేషెంట్స్ కొన్ని పండ్లు జ్యూస్ లకు దూరంగా ఉండడం మంచిది. వాటి వల్ల వారికి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధుమేహ సమస్య ఉన్నవారు ఎటువంటి జ్యూస్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ద్రాక్ష రసం- ద్రాక్ష రసాన్ని తయారు చేసేటప్పుడు ఫైబర్ లేకుండా తయారుచేస్తారు. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను పెంచుతుంది. ఇది రక్తాన్ని చిక్కబడేలాగా చేస్తుంది. దీని ద్వారా షుగర్ లెవెల్స్ మరింతగా పెరుగుతాయి. ఒక్కోసారి ఇది హార్ట్ ఎటాక్ కూడా దారితీస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధుమేహ సమస్య ఉన్నవారు ద్రాక్ష జ్యూస్ ను తాగకూడదు. కేవలం కొన్ని పండ్లు మాత్రమే తింటే సరిపోతుంది..

Health Tips: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మీ శరీరంలో ఏమవుతుంది

నారింజ రసం- మణిదీన సమస్య ఉన్నవారు నారింజ జ్యూస్ ని కూడా తాగకూడదు. ఇది కూడా రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉన్నప్పటికీ కూడా మధుమేహ రోగులకు ఈ జ్యూస్ అంత మంచిది కాదు. కేవలం పండ్లు తీసుకుంటే సరిపోతుంది.

పైనాపిల్- పైనాపి ల్ జ్యూస్ ని షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉన్నప్పటికీ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. ఇది అంతా మంచిది కాదు..

ఆపిల్ జ్యూస్- రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చని చెప్తుంటారు. అయితే మనమే రోగులు ఆపిల్ పండుని తింటే ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ఆపిల్ జ్యూస్ ని తీసుకోవడం వల్ల అనర్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీరిలో షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను తీసుకొని వస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి