బీన్స్ ప్రతిరోజు మనము తీసుకునే ఆహార పదార్థాలలో ఒకటిగా ఉంటుంది.
బీన్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, పుష్కలంగా ఉంటాయి. బీన్స్ ప్రతి రోజు తీసుకోవడం ద్వారా గుండెకు కాలేయానికి ,కడపకు సంబంధించిన అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బీన్స్ లో సాధారణంగా చిక్కుళ్ళు, సోయాబీన్స్, బఠానీలు, వేరుశనగలు వంటి ఆహార పదార్థాలు ఉంటాయి. ప్రోటీన్ ,ఫైబర్ అధికంగా విటమిన్లు అధికంగా ఉండడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లను గుండె జబ్బులను దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి.
బీన్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు.
ప్రోటీన్- బీన్స్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్ మనకు శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఇది మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఏమైనా ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. బీన్స్ లో ఫైబర్ ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి అనేక రకాల జబ్బులను తగ్గిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్- యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. దీని ద్వారా అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి. అండ్ ఆక్సిడెంట్ వల్ల మన శరీరంలో ఇన్ఫెక్షన్ల వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
Health Tips: మీరు మొదటిసారి తల్లి కాబోతున్నారా..
గుండె ఆరోగ్యం- బీన్స్ ను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బీన్స్ లో కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉండడం ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనిలో అధిక ఫైబర్ ఉండడం వల్ల గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
షుగర్ ను తగ్గిస్తుంది- బీన్స్ ప్రతిరోజు తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీని ద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. వీల్స్ లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ ,ఫైబర్ అధికంగా ఉంటుంది దీని ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో ఒక కప్పు బీన్స్ ను ఆడ్ చేసుకున్నట్లయితే రక్తంలోని చక్కర స్థాయిలో తగ్గుతాయి. వీటిలో పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉండటం ద్వారా రక్తపోటు సమస్య కూడా తగ్గుతుంది.
క్యాన్సర్ సమస్యను తగ్గిస్తుంది- బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్సు , యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.