పురుషులు స్త్రీలు డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్యతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు మహిళల్లో ఈ సమస్య చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన కాస్మెటిక్స్ ను యూస్ చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అంతేకాక దీనిలో కెమికల్స్ ఎక్కువగా వాడడం ద్వారా మన శరీరానికి ఎలర్జీని కలిగిస్తుంది. చాలామంది డార్క్అండర్ ఆర్మ్స్ గురించి ఆందోళన పడుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలతోటి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

డార్క్ అండర్ ఆర్మ్స్ కారణాలు.. మన చర్మానికి రంగుని ఇచ్చే మెలనిన్ కణాలు సాధారణం కంటే ఎక్కువగా వేగంగా పెరిగినప్పుడు ఆ ప్రదేశంలో నల్లబడడం జరుగుతుంది. అండర్ ఆర్మ్స్ లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అక్కడ హెయిర్ ని తీసుకోవడం ద్వారా పదే పదే తొలగించడం వల్ల కూడా అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతాయి.

డార్క్ అండరామ్స్ తగ్గించుకోవడం కోసం రెమెడీస్..

అలోవెరా- అలోవెరా జెల్ డార్క్ అండర్ ఆర్మ్స్ ను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును అండర్ ఆర్మ్స్ దగ్గర రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కున్నట్లయితే ఈ సమస్య తగ్గుతుంది.

Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.

బేకింగ్ సోడా- ఒక చిన్న బౌల్ లో రెండు చెంచాల బేకింగ్ సోడాను తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం వేసుకొని ఈ పేస్టును అండర్ ఆర్మ్స్ దగ్గర రాసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్- డార్క్ అండర్ ఆర్మ్స్ తగ్గడానికి రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఒక స్పూన్ బంగాళాదుంప పేస్టుని కలిపి ఆ మిశ్రమాన్ని అండరామ్స్ పైన అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత కడుక్కున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

అంతేకాకుండా కొబ్బరి నూనెను 15 నిమిషాల పాటు రోజు రాసుకున్నట్లయితే కూడా మంచి ఫలితం ఉంటుంది. అండర్ ఆర్మ్స్   తగ్గడానికి నిమ్మకాయను రాస్తే కూడా ఈ సమస్య తగ్గుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి