Loose Motions (Photo-Pixabay)

విరేచనాలు చాలా ఇబ్బందిని కలిగిస్తుంటాయి. మలంలో ఎక్కువ నీటి కంటెంట్ ఉన్నప్పుడు, అది పెద్ద ప్రేగు ద్వారా శోషించబడనప్పుడు సాధారణంగా నీళ్ల విరేచనాలు (Diarrhea) అవుతుంటాయి. కొన్ని ఆహార పదార్థాలకు అలెర్జీలు, ప్రేగు సంబంధిత వ్యాధులు, ఆల్కహాల్ వినియోగం, మందులు, హైపర్ థైరాయిడిజం, మధుమేహం, కొన్ని ఇన్ఫెక్షన్స్, పోషకాలను సరిగ్గా గ్రహించకపోవడం వల్ల కూడా ఈ విరేచనాలు అవుతుంటాయి.

సాధారణంగా లూజ్ మోషన్ రెండుమూడు రోజుల వరకు ఉంటుంది. ఇవి తగ్గేందుకు (Health Tips Stop Loose Motions) మనం గృహ చిట్కాలు పాటించినా కంట్రోల్ చేయవచ్చు. అల్లం అనేక వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక అద్భుత మసాలా. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. లూజ్ మోషన్ చికిత్సకు సమర్థవంతమైన ఇంటి నివారణగా (Homemade Remedies) కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.

జొన్న రొట్టెలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, మధుమేహ వ్యాధి గ్రస్తులు తప్పక తీసుకోవాల్సిన ఆహారం, దీని ప్రయోజనాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు

అల్లం లూజ్ మోషన్ తగ్గడం కోసం ఒక అద్భుతమైన ఇంటి చిట్కా అని వైద్యులు కూడా చెబుతారు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అల్లం రసం తాగడం వల్ల లూజ్ మోషన్ తక్షణమే ఆగిపోవడమే కాకుండా కడుపు నొప్పి తగ్గుతుంది. నిమ్మకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. లూజ్ మోషన్‌ను ఆపడానికి ఇది మంచి హోం రెమెడీగా ఉపయోగపడుతుంది. కొత్తిమీర అజీర్ణానికి సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి మేలు చేస్తుంది. కొత్తిమీర ఆకులలో ఉండే రసాలు కడుపుని శాంతపరుస్తాయి. కాలేయం సరైన పనితీరుకు సహాయపడతాయి.