Kidney Representative Inage

ప్రస్తుతం ఉన్న కాలంలో వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్ని ఏదో ఒక సమస్య  వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉండేందుకు  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మనకు శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి ఎక్కువగా శరీరంలోని మురికిని, ద్రవాలను శుద్ది చేయడంలో దోహదపడుతాయి.

ముఖ్యంగా కిడ్నికి సంబంధించిన అత్యంత భయంకరమైన వ్యాధులలో కిడ్నీ స్టోన్స్ కూడా ఒకటి. ఈ క్రమంలోనే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఈ క్రింది ఆహారాలు కారణమవుతూ ఉంటాయి. కనుక ఈ పదార్థాలను ఎప్పటికైనా దూరం పెట్టడం చాలా మంచిది. లేదంటే చేజేతులా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఈ పదార్థాలే కారణం అవుతాయని.. నిపుణులు తాజా అధ్యయనంలో తెలిపారు. అవేంటో ఓ సారి చూద్దాం.

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న ఎక్స్‌‌బీబీ కరోనా వేరియంట్, కొత్తగా 209 తీవ్ర కొవిడ్‌ కేసులు నమోదు, 24 మంది మృతి

బాగా డీప్ గా వేయించిన చికెన్, ఉప్పు తో వేయించిన గింజలు , కూల్ డ్రింక్స్, కోలా పానీయాలు .అలాగే కోలా గింజ యొక్క సారాన్ని కలిగి ఉన్న కార్బోనేటేడ్ శీతల పానీయాలు.

పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్‌లు , ఫాస్ట్ ఫుడ్స్. అదేవిధంగా ప్రాసెస్ చేయబడిన మాంసాలు.. అనగా ఉప్పుతో లేదంటే రసాయనాలతో కలిపి తయారు చేయబడిన మాంసాహారం.

కాల్షియం, చేపనూనెలు వంటి సప్లిమెంట్లు. బ్లాక్ టీలు కూడా ఎక్కువ మొత్తంలో ఆక్సలేట్ కంటెంట్ ను కలిగి ఉంటాయి. దీనివల్ల కిడ్ని స్టోన్స్ రావడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి.

అలాగే బాదం, జీడిపప్పులు తినవల్సిన దాని కన్నా ఎక్కువగా తినడం వలన కూడా కిడ్ని స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.