మన ఆరోగ్యం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి. అంటే మన శరీరం లోపల ఉన్న వ్యర్ధాలను బయటకు పంపించడం చాలా ముఖ్యం. మన శరీరంలో మలినాలు ఎక్కువైనప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిని తగ్గించుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి డి టాక్స్ డ్రింకులను తాగినట్లయితే మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించవచ్చు. ఆ మూడు డీటాక్స్పై జ్యూసుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
కొత్తిమీర ,పుదీనా రసం- ఉదయాన్నే కొత్తిమీర పుదీనా రసాన్ని జ్యూస్ రూపంలో తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటికి పోతాయి. అంతేకాకుండా కొంతమందిలో తరచుగా కళ్ళు తిరగడం, తలనొప్పి వంటి సమస్యలు బాధపడుతుంటారు. అటువంటి వారు కూడా ఈ జూసు తాగినట్లయితే కొత్తిమీర పుదీనాలో ఉన్న పోషకాలు అన్నీ కూడా శరీరానికి అందుతాయి. అంతేకాకుండా శరీరాన్ని శుభ్రపరుస్తాయి. మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
Health Tips: మీరు ప్రతిరోజు తీసుకునే ఈ ఆహారాలు విషంతో సమానం
గుమ్మడికాయ రసం- బూడిద గుమ్మడికాయ రసంలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ,ఐరన్ ,మెగ్నీషియం ,ఫోలేట్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లో అధికంగా ఉండడం ద్వారా అనేక రకాల జబ్బుల నుండి బయట పడేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మల బద్ధకం, అజీర్ణం, కడుపు సమస్యలతో బాధపడేవారు బూడిద గుమ్మడికాయ రసాన్ని తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకు పోతాయి. అంతేకాకుండా దీన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం కూడా జరుగుతుంది. షుగర్ బీపీ వంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఇది చక్కటి రెమిడిగా చెప్పవచ్చు.
తేనే, నిమ్మరసం- ఉదయాన్నేఖాళీ కడుపుతో తేనె ,నిమ్మరసం తీసుకోవడం ద్వారా కూడా మన శరీరంలో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకు పోతాయి. ఇది మన శరీరానికి కావాల్సిన అంత నీటి శాతాన్ని అందించుతుంది. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుంది. తేనెలో నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారి నుండి బయట పంపిస్తాయి. ఈ మూడు జ్యూస్లను తీసుకోవడం ద్వారా శరీరం డీటాక్స్పై అవుతుంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు తగ్గుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి