ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా షుగర్, బిపి, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా అధిక బరువు వల్ల ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవడం కోసం మనము ఈరోజు కొన్ని ఆకులను ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అధిక బరువు నుంచి బయటపడవచ్చు. ఆ ఆకులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు- కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీవన క్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మన తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేస్తుంది. మలబద్ద సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలే ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. దీన్ని తీసుకోవడం ప్రతిరోజు కరివేపాకులను తీసుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు.
Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా
తిప్పతీగ- తిప్పతీగను అమృతవల్లి అని అంటారు. ఇది నిజంగా మన శరీరానికి ఒక అమృతంగా చెప్పవచ్చు. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మన శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ని తగ్గించడంలో తిప్పతీగ చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహ సమస్యలను బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది.
తులసి ఆకులు- తులసిని మనం ఎంత పవిత్ర మొక్కగా పరిగణిస్తాము. అంతేకాకుండా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. తులసాకులు అనేక రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా సీజనల్గా వచ్చేదా గు జలుబు వంటి వాటిలలో ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా రక్తంలోని కొలెస్ట్రాల తగ్గించడానికి తులసాకులు బాగా సహాయపడతాయి. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనేక రకాల జబ్బులను తగ్గిస్తుంది.
అశ్వగంధ- అశ్వగంధ లో అనేకరకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉండే ఇది అనేక రకాల జబ్బులను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు అశ్వగంధ పొడిని నీళ్లల్లో కడుక్కుని తాగినట్లయితే తొందరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర బీపీ కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడంలో అశ్వగంధ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి