Immunity Boosting Food (Photo Credits: Pixabay)

థైరాయిడ్ ఒక దీర్ఘ కాలిక సమస్య.ఈ సమస్య మగవారిలో కన్నా, ఆడవారిలో దాదాపు రెట్టింపు కనిపిస్తుంది.ప్రస్తుత సమాజంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని థైరాయిడ్ సమస్య వేధిస్తోంది. మన దేశంలో సాధారణంగా 40 మిలియన్ల కంటే ఎక్కువమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమంది ఈ సమస్య తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. థైరాయిడ్ వల్ల హార్మోన్ల అసమతుల్యతతో వేధించే అవకాశం ఉంటుంది.

ఈ థైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసటగా ఉండటం.. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ హైపర్ థైరాయిడిజం వల్ల జీవక్రియలో పనితీరు వేగం పెరగడం వలన గుండెలో దడ, అకస్మాతుగా బరువు తగ్గిపోవడం, కారణం లేకుండగానే చెమలు పట్టడం విరేచనాలు రావడం లాంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నిద్ర పట్టకపోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలు అన్నింటిని థైరాయిడ్ లక్షణాలు అని వైద్యులు సూచిస్తున్నారు.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...

హైపో థైరాయిడిజం వల్ల జీవక్రియ పనితీరు తగ్గడం తో పాటు కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు వెల్లడించారు. మలబద్దకం, గుండె కొట్టుకునే వేగం తగ్గుకుంటు పోవడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, మానసిక ఆందోళన సమస్యలకు సులువుగా పరీక్ష పెట్టే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉసిరి, బ్రెజిలియన్ బీటెల్ నట్, గుమ్మడి గింజలు, పెసరలు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ కు చెక్ పెట్టవచ్చని నిపుణులు తెల్పారు.

ఈ థైరాయిడ్ సమస్య వచ్చిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఎన్నో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ సమస్య మిమ్మల్నివేధిస్తుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.