చాలామందిలో కాళ్ల నొప్పులు కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో ఈ సమస్య మరింతగా వీరిని వేధిస్తూ ఉంటుంది. అయితే చలికాలంలో ఈ సమస్య పెరగడానికే కారణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే విధంగా చిట్కాలు కూడా తెలుసుకుందాం.
కారణాలు- చలికాలంలో కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు రావడానికి గల కారణాల గురించి మనం తెలుసుకున్నట్లయితే తక్కువ ఉష్ణోగ్రత కండరాల సంకోచం వల్ల కీళ్లనొప్పుల సమస్య మరింతగా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా శారీరక శ్రమ లేకపోవడం విటమిన్ D లోపము వంటి సమస్యలతో కూడా కీళ్ల నొప్పుల సమస్య అధికం అవుతుంది.
శారీరక శ్రమ- చలికాలంలో చాలామంది వ్యాయామం చేయరు. దీని ద్వారా కూడా బరువు పెరుగుతారు దీని వల్ల కీళ్ల నొప్పులు కండరాల నొప్పుల సమస్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి మీరు సీజన్తో సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా వ్యాయమం చేసినట్లయితే కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు అంటే సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి వ్యాయామము సహాయపడుతుంది.
బరువు- అధిక బరువు సమస్య కూడా చలికాలంలో కండరాల, కాళ్ల నొప్పులకు దారితీస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎక్కువ సేపు పని చేసిన లేదా ఎక్కువ సేపు నిలుచున్నా కూడా చలికాలంలో ఈ సమస్య మరింతగా తీవ్రమవుతుంది. కాబట్టి మీరు బరువును ఎప్పుడు కూడా నియంత్రణలో ఉంచుకుంటే మంచిది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా వేధిస్తే మీరు బరువు తగ్గించుకోవడం ఉత్తమం.
Health Tips: ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ...
విటమిన్ డి- ఈ కాలంలో సూర్య రష్మి చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చలికి ఎవరు కూడా సూర్య రష్మి లో కూర్చోడానికి ఇష్టపడరు అటువంటి అప్పుడు కూడా మన శరీరంలో డి విటమిన్ లోపం కారణంగా కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్య మరింత ఎక్కువగా అవుతుంది. అటువంటి అప్పుడు మీరు డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి సప్లమెంటరీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు.
యోగ ధ్యానం- కొన్నిసార్లు ఈ సమస్య ఎక్కువ అయినప్పుడు మానసికంగా కూడా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి అప్పుడు మీరు యోగా ధ్యానం వంటివి చేసినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీటితోపాటు వాటర్ను అధికంగా తీసుకోవడం జంక్ ఫుడ్ ను తగ్గించడం ఆయిల్ ఫుడ్ ను తగ్గించడం పండ్లను కూరగాయలను ఆహారంలో అధికంగా భాగం చేసుకోవడం ప్రతిరోజు 30 నిమిషాల పాటు నడవడం మంచిది. చేసినట్లయితే కాళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు వంటి సమస్య నుంచే బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి