![](https://test1.latestly.com/wp-content/uploads/2024/05/Tablets.jpeg?width=380&height=214)
మన శరీరానికి ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఐరన్ మన రక్త పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్ చాలా అత్యవసరం. ఎముకలకు క్యాల్షియం చాలా ముఖ్యమైన విటమిన్ చాలా మందిలో ఐరన్ లోపం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నీరసంగా అనిపిస్తుంది. ఇది మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. అయితే 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న బాలికల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. మహిళల్లో ఈ లోపాన్ని అధిగమించడానికి ఐరన్ మాత్రలు వాడుతూ ఉంటారు. వీటిని ఐరన్ సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటారు. ఐరన్ మాత్రలు ఏ సమయంలో తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఐరన్ మాత్రలు తీసుకోవడానికి సరైన సమయం
ఐరన్ మాత్రలను ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. అయితే కొంతమందిలో ఈ ఐరన్ సప్లిమెంట్స్ ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే వారికి కడుపులో నొప్పి వికారం విరోచనాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఖాళీ కడుపుతో తీసుకుంటే కొంతమందిలో వాంతులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి అటువంటి వారు భోజనం చేసిన తర్వాత తీసుకోవచ్చు.. అయితే ప్రతిరోజూ ఒక ఐరన్ మాత్రమే వేసుకోవాలి ఒకటి కంటే రెండు సార్లు వేసుకోవాల్సి వస్తే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవచ్చు. ఐరన్ మాత్రం వేసుకునేటప్పుడు పాలు మరియు క్యాల్షియం టాబ్లెట్లను కలిపి తీసుకోకండి. కనీసం రెండు గంటల విరామంతో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పచ్చి కూరగాయలు వంటి వాటితోటి ఐరన్ సప్లిమెంటరీ తీసుకోకూడదు. అంతే అదే విధంగా టీ కాఫీ తో పాటు కూడా ఐరన్ మాత్రలను తీసుకోకూడదు దీని ద్వారా ఐరన్ మన శరీరానికి అంతగా లభించదు.
Health Tips: మెంతుల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఐరన్ మాత్రం అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు
ఐరన్ మాత్రలు కొంతమందికి మలబద్ధకం సమస్యను తీసుకువస్తుంది. కొంతమందిలో ఇది అతిసారంగా గుర్తించబడుతుంది. మలబద్దక సమస్య ఉన్నట్లయితే మీరు మీ వైద్యుని సలహాతో ఈ మాత్రను ఎంత తీసుకోవాలో తెలుసుకొని తీసుకోండి. ఐరన్ మాత్రలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కడుపులో తిమ్మిరి, కడుపులో నొప్పి వంటివి ఏర్పడతాయి. ఒకవేళ మీరు సిరప్ రూపంలో ఐరన్ తీసుకున్నట్లయితే మీ దంతాలపైన మరకలు ఏర్పడతాయి. అయితే మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిరోజు ఎన్ని ఐరన్ మాత్రలు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అనేది ఒకసారి వైద్యుల్ని సంప్రదించి తీసుకుంటే మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.