ఎల్లప్పుడు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది మన రోగనిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక శక్తి వల్ల వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. అయితే కొంతమందిలో తరచుగా కొన్ని రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరం వంటివి తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇవి రాకుండా ఉండడానికి రోగనిరోధక వ్యవస్థ మన్నే రక్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు రోగినిరోధక శక్తి చాలా తీవ్రమైన వ్యాధులతో కూడా పోరాడడానికి మనకు సహాయపడుతుంది. అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలుసుకోవడానికి ముందుగా మన శరీరంలో ఎటువంటి సంకేతాలు వస్తాయో తెలుసుకుందాం..
జలుబు దగ్గు- చాలామందిలో తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అవి నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీనివల్ల మన రోగనిరోధక శక్తి బలహీ ఉందని చెప్పడానికి ఇది ఒక సంకేతం. కొంతమందిలో సంవత్సరానికి 3 నుండి 4 సార్లు జలుబు దగ్గు వస్తున్నట్లయితే అది రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని చెప్పే తీవ్రమైన అనారోగ్య సమస్యగా మనము పరిగణించవచ్చు.
గాయాలు త్వరగా మానవు- తక్కువగా ఉన్న వారిలో ఏదైనా గాయమైనప్పుడు అది మానడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి అప్పుడు వీరిలో రోగనీరోధక శక్తి బలహీనంగా ఉందని చెప్పవచ్చు..
Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.
తరచుగా ఇన్ఫెక్షన్లు- రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వాతావరణంలో ఏ చిన్న మార్పు వచ్చినప్పుడు కూడా వీరిలో అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా చెవి ఇన్ఫెక్షన్, సైనస్ ఇన్ఫెక్షన్ ,యూరిన్ ఇన్ఫెక్షన్ల వంటి రకరకాల ఇన్ఫెక్షన్లు తరచుగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి..
బలహీనత- కొన్నిసార్లు మనకు ఆహారం బాగా తిన్నప్పటి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడు కూడా బలహీనంగా ఉంటారు. విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా ఎక్కువగా అలసట బలహీనతగా అనిపిస్తుంది. అటువంటి అప్పుడు వారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని చెప్పడానికి సంకేతం.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా- మనం అనేక రకాల జబ్బుల నుండి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడడానికి రోగ నిరోధక వ్యవస్థను పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మనం పోషకాహారాన్ని తీసుకోవాలి ఇందులో కూరగాయలు పండ్లు పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి ముఖ్యంగా వ్యాయామం కూడా చాలా అవసరం విటమిన్ సి తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ధూమపానం మద్యపానం వంటివి కూడా మానివేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి