
HesalthTips: ఈ మధ్యకాలంలో చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం ద్వారా షుగర్ థైరాయిడ్ ఇటువంటి సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలలో తీసుకోవడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు. అయితే ముఖ్యంగా పండ్లు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు తీసుకునే ఆహారంలో ఒక పూట కేవలం పనులు తీసుకోవడం ద్వారా మీ శరీరంలో అదనంగా పేరుకుపోయిన కరిగించుకోవచ్చు. కొలెస్ట్రాల్ ను కరిగించే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవకాడో- అవకాడో కొలెస్ట్రాల తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో అవకాడో సహాయపడుతుంది.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు.
పుచ్చకాయ- పుచ్చకాయ పుచ్చకాయలో వాటర్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మన ఆహారం నిండుగా ఉంటుంది. ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండడం ద్వారా ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాము. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆపిల్- ఆపిల్ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆపిల్ ని తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్ అందుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది. దీని ద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
కివి- కివి పండు లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ సమస్య రాకుండా చేస్తుంది. కివి పండు ప్రతిరోజు తీసుకో శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు బయటకు పోతుంది.
కేవలం ఆహార పదార్థాలే కాకుండా జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కూడా శరీరంలో ఉన్న చెడు కొనసాగు తొలగిపోతుంది. వాకింగ్ చేయడం, మాంసాహారాలకి దూరంగా ఉండడం, ధూమపానం, మద్యపానం వంటి వాటికీ దూరంగా ఉండటము, ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు ఆహారంలో తీసుకోవడం వాటర్ అధికంగా తీసుకోవడం ద్వారా అదనంగా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్లో తగ్గించుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి