మన శరీరం అనేక రకాల జబ్బులు రాకుండా ఉండడానికి రోగనిరోధక వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి వల్ల మన శరీరం అనేక రకాల వ్యాధులతో పోరాడుతుంది. తొందరగా వ్యాధులను తగ్గించే లాగా చేస్తుంది. దీనికోసం మనం ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలి. అయితే కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు వాటి వల్ల తరచుగా రోగాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీలో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఇలాంటి అలవాట్లు మానుకుంటే మీకు రోగనిరోధక శక్తి పెరిగి రోగాలతో పోరాడే శక్తి వస్తుంది. ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయిల్ ఫుడ్స్- రోగ నిరోధక శక్తి పైన జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అధికంగా షుగర్ ఉన్న ఫుడ్స్ ,ప్రాసెస్ చేసిన ఫుడ్స్, జంక్ ఫుడ్ వంటివి తీసుకుంటే మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీని ద్వారా తరచుగా జబ్బులు బారిన పడే అవకాశం ఉంటుంది.
Health Tips: బ్లాక్ కాఫీ నిజంగా బరువును తగ్గిస్తుందా..
నిద్రలేమి- నిద్ర లేకపోవడం వల్ల కూడా మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. నిద్రలేమి మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనకు సరైన నిద్ర ఉన్నప్పుడు మన శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీ బాడీస్ ను ,సైటోకిన్లను ఉత్పత్తి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో తగినంత నిద్ర లేకపోవడం వల్ల వాటి పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల వ్యాధులు తరచుగా వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
శారీరక శ్రమ లేకపోవడం- ఈ మధ్యకాలంలో చాలామంది శారీరక శ్రమ లేకపోవడం ఒక సమస్యగా మారింది. రెగ్యులర్గా వ్యాయామం చేయడం బరువు నియంత్రణలో ఉంచుకోవడం యోగ మెడిటేషన్ వంటివి చేస్తే మీ రోగనిరోధక వ్యవస్థ బలపడి ఇన్ఫెక్షన్ లో రాకుండా ఉంచుతుంది.
ధూమపానం, మద్యపానం- ధూమపానం ,మద్యపానము మీ రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయి. మీ అనారోగ్య సమస్యలను పెంచడమే కాకుండా అనేక రకాల తీవ్రవ్యాధులను కలగజేస్తాయి. కాబట్టి మీ రోగనిరోధక శక్తి పెరగాలి అంటే ధూమపానం మద్యపానానికి దూరంగా ఉంటే మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి