Seasonal Flu Alert: సీజనల్‌ ఫ్లూ ముప్పు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని కేంద్రం హెచ్చరిక, ఈ లక్షణాలు ఉంటే వెంటనే..
Representative image

వేగంగా మారుతున్న వాతావరణ మార్పులతో సీజనల్‌ ఫ్లూ సమస్య ఎక్కువగా ఉందని, ప్రతి ఒక్కరూ దీనిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health Advice on Seasonal Flu) హెచ్చరించింది. సీజనల్‌ ఫ్లూ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో (Seasonal Flu) శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ వస్తుంది. ఇన్‌ఫ్లుఎంజా ఇన్‌ఫెక్షన్ దగ్గు, తుమ్ముల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది.

ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా, కుటుంబంలో ఇతరులను దాని బారినపడకుండా సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇన్‌ఫ్లుయెంజాతో జ్వరం, చలి, దగ్గు, గొంతునొప్పి, ముక్కుకారటం, కండరాలు, ఒంటినొప్పులు, అలసట ఉంటాయి. మరికొందరిలో వాంతులు, విరేచనాలు ఉండే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పెద్దల్లో కంటే పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని (precautionary measures to control infection) సూచించింది.

లాలాజలంతో ఈ టెస్ట్ చేస్తే చాలు క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయొచ్చు..పూర్తి వివరాలు మీ కోసం..

వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండడంతో పాటు మిగతా వారికి దూరంగా ఉండాలని, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతో పాటు లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మందులు తీసుకోవాలని సూచించింది. ఫ్లూ లక్షణాలు నాలుగు నుంచి వారంలో తగ్గుతాయని.. దగ్గు, అలసట వారాల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మీరు ఫ్లూ బారిన పడినట్లయితే, రోగనిరోధక వ్యవస్థ బలహీనతకు సంకేతం కావొచ్చని.. వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Here's Tweet

ఆకలి లేకపోవడం, తినాలనే కోరిక కూడా ఉండదని పేర్కొంది. చాలా మందికి ఫ్లూ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగానే ఉంటుందని.. అయితే తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది.

మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వ్యాధి, అలస్కాపాక్స్‌తో ఒకరు మృతి, ఈ వైరస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి

ఉబ్బసం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు ఫ్లూ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్‌ఫ్లుఎంజాను నివారించడానికి పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లను అనుసరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.