ప్రశ్న: నా పేరు సునీత (పేరు మార్చాం) నా వయసు 34 నాకు ఒక పాప ఉంది. నా భర్త ఉద్యోగరీత్యా హైదరాబాదులో పనిచేస్తూ ఉంటారు. అయితే మాకు వివాహం జరిగి 10 సంవత్సరాలయింది అంతా సాఫీగానే జారిపోతుంది. ఈ మధ్యకాలంలో నా భర్త హైదరాబాదులో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసింది. ఆయన చేసిన తప్పును నిలదీశాను అందుకు అతను నన్ను తిరగబాదాడు, శారీరకంగా హింస పెట్టాడు. నేను వదిలేస్తే నువ్వు నీ పిల్లలు అనాధలు అయిపోతారు అని దిక్కుమక్కు లేనివాళ్ళు అయిపోతారని బెదిరించాడు. దీంతో ఏమీ చేయలేక నేను మౌనంగా అన్ని భరిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మా ఇంటి సమీపంలోనే ఓ డాక్టర్ గారితో నేను స్నేహం చేశాను. ఆయన పనిచేసే ఆసుపత్రిలో నేను రిసెప్షనిష్టుగా పనిచేస్తున్నాను. ఈ క్రమంలో మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే డాక్టర్ గారి భార్య ఇటీవలే మరణించింది. ఆయనకు దీంతో ఆయన నా పరిస్థితి గమనించి. నన్ను వివాహం చేసుకుంటాను అని అంటున్నారు. ఒకవైపు నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు మరో వివాహం చేసుకొని నన్ను వదిలేశాడు. ఇప్పుడు నాకు తోడుగా నిలిచి నా తండ్రి నా పాపకు తండ్రి అవుతా అంటున్నాడు. ఇప్పుడు నా భర్తను వదిలేయడం ఎలా సమాజం ఇది హర్షిస్తుందా నేనేం చేయాలో చెప్పండి.
సమాధానం: మీరు చెప్పిన సమస్యతో ఇష్టమైనది మీ భర్త మీకు తెలియకుండా మరో వివాహం చేసుకున్నారు. నిజానికి మీ భర్త పై మీరు గృహహింస కేసు పెట్టి, చట్టపరంగా రక్షణ పొందే హక్కు ఉంది. అయినప్పటికీ మీరు మౌనంగా హింసను భరించారు. ఇక మీరు చట్టపరంగా డాక్టర్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీ భర్త నుంచి విడాకులను పొందండి. ఆయన వివాహేతర సంబంధం పెట్టుకొని మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. కావునా, మీరు న్యాయ పరంగా ఆయన నుంచి విడాకులు పొందేందుకు ప్రయత్నించండి. లాయరు ద్వారా మీరు విడాకుల ప్రక్రియను ప్రారంభించండి. మీరు ఒకవేళ వివాహం చేసుకోవాలని కచ్చితంగా అనుకుంటే మాత్రం చట్టపరంగా కోర్టు ద్వారా విడాకులు పొందిన తర్వాత చేసుకుంటే మంచిది.