ప్రశ్న: నా పేరు సరోజ (పేరు మార్చాం) మాది కాకినాడ నా వయసు 32 సంవత్సరాలు. మాకు పెళ్లి జరిగి 7 సంవత్సరాలు గడుస్తోంది. ఇంకా పిల్లలు కలగలేదు. నా భర్త ఉద్యోగరీత్యా తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు. అక్కడకు వెళ్ళినప్పుడల్లా కనీసం మూడు నుంచి నాలుగు నెలలు ఉంటారు దీంతో ఆయన నా పట్ల గత కొంతకాలంగా అనాసక్తితో ఉన్నారు మా ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. చివరిసారిగా మేమిద్దరం శారీరకంగా కలిసింది మూడు సంవత్సరాల క్రితం అయితే ఈ మధ్యకాలంలో మా ఇంటిలోనే అద్దెకు ఉంటున్న ఇంజనీరింగ్ చదివే కుర్రవాడితో పరిచయం జరిగింది. గత మూడు నెలలుగా అతను నాతో కాస్త సన్నిహితంగా మాట్లాడుతున్నాడు. దీంతో అతనికి నా బాధలు చెప్పుకున్నాను. అయితే తాను కూడా తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో మోసపోయానని నాతో తన బాధ చెప్పుకున్నాడు. దీంతో ఇద్దరం మా బాధలు పంచుకొని సన్నిహితంగా మారాం. ఆ సాన్నిహిత్యం కాస్త శారీరక సంబంధంగా మారింది. ప్రస్తుతం ఇద్దరం రెండు మార్లు శారీరకంగా కలిశాం. నా భర్త కూడా దూరంగా ఉండటం వల్ల మూడు సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేకపోవడం ద్వారా ఒక బలహీన క్షణంలో మేమిద్దరం దగ్గర అవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ చదివే కుర్రవాడితో మా బంధం తప్పుడు దారిలో వెళ్తోందని నాకు అర్థం అవుతోంది. ఆ కుర్రవాడు ఈ మధ్య మనిద్దరం హైదరాబాద్ వెళ్లిపోయి సహజీవనం చేద్దామని నాకు ప్రపోజల్ పెట్టాడు. అయితే ఇది నాకు తప్పు అనిపిస్తోంది. నా భర్తను వదలివెళ్లేందుకు నాకు సరైన కారణం కనిపించడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వండి.
Relation Tips: 25 ఏళ్ల నేను 50 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడ్డాను,
సమాధానం: మీరు చేస్తున్నది మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం చాలా పెద్ద తప్పు. మీ భర్తకు మీ వివాహేతర సంబంధం గురించి తెలిస్తే చట్ట ప్రకారం కూడా అతడు మీ నుంచి విడాకులు పొందవచ్చు. అప్పుడు మీ జీవితం మరింత జటిలం అయ్యే పరిస్థితి ఉంది. మీతో సహజీవనం చేస్తాను అంటున్న కుర్రవాడు, తాత్కాలిక సుఖం కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకునేందుకు అవకాశం కనిపిస్తోంది. నిజంగా మీకు తోడు నిలవాలి అనుకుంటే మీరు మీ భర్త నుంచి చట్ట ప్రకారం విడాకులు పొంది. ఆ కుర్రవాడితో పెళ్లి చేసుకొని మీరు కొత్త జీవితం ప్రారంభించే వీలుంది. కానీ పెళ్లి కాకుండా సహజీవనం అంటే మాత్రం నమ్మదగిన బంధం కాదు అని అర్థం. మీరు వెంటనే ఆ కుర్రవాడితో మీ సంబంధం తెంచుకుంటే మంచిది. అలాగే మీ భర్తను మోసం చేశాననే బాధ ఉంటే మాత్రం వెంటనే సైకాలజిస్టు ద్వారా కౌన్సిలింగ్ పొందితే మంచిది. మీ కాపురాన్ని నవ్వుల పాలు చేసుకోవద్దు.