Urine | Representational Image | (Photo Credits: Pixabay)

శరీరం విసర్జించే మూత్రం ద్వారా అనారోగ్య సమస్యలను చాలావరకూ పసిగట్టవచ్చు. ఏదైనా వ్యాధి ప్రారంభమైందంటే... మూత్రంలో రంగు- మార్పులను కనబరుస్తుంది. మూత్రం రంగు (Urine Color) మారడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. మూత్రం ముదురు రంగులో (Dark Urine) అంటే ముదురు పసుపు రంగులో కనిపిస్తే, అది నీటి కొరత వల్ల కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఎక్కువ నీరు, ద్రవాలను తీసుకోవాలి. పురుషుల్లో గుండె జబ్బులు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయో తెలుసా? గుండె జబ్బులు రాకుండా ఇవి చేస్తే చాలు, మీ గుండె పదిలం

మూత్రం ఎరుపు రంగులో వుంటే మూత్రంలో రక్తం లేదా మల పదార్థం ఉనికిని సూచిస్తుంది. ఈ సమస్య ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఎందుకంటే ఈ రక్తం కిడ్నీ, మూత్రాశయం, గర్భాశయం, రక్తపోటు వల్ల కావచ్చు. ఈ రంగు అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇది కాలేయ వైఫల్యం, తీవ్రమైన కాలేయ ఇన్ఫెక్షన్, కణితులు, హెపటైటిస్ వంటి తీవ్రమైన సమస్యల వల్ల కూడా కావచ్చు. ఈ రంగు మూత్రం శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతుంది. కనుక మూత్రం రంగును అనుసరించి దాదాపుగా అనారోగ్య సమస్యలను అంచనా వేయవచ్చు.