Dark Circles: ఇంట్లో దొరికే ఈ వస్తువులతో కళ్ల కింద నలుపు మాయం, ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు, కళ్లజోడు వల్ల మచ్చలు ఏర్పడ్డవారికి కూడా మంచి చిట్కాలు

Hyderabad, May 25: కళ్లజోడు ధరించే వారిలో చాలా మందిలో కంటి కింద నల్లటి వలయాలు (dark circles ) ఏర్పడతాయి. అలాగే ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటిని తొలగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. కీరదోసను గుజ్జుగా (Keera) చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది. అంతేగాకుండా కీరదోస రసంలో టమోటా (Tomato), బంగాళాదుంపల రసం కలిపి ముక్కుపై పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మరసంలో రెండు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

Monkeypox Outbreak: కరోనా కన్నా వేగంగా విస్తరిస్తున్న మంకీ పాక్స్‌, ఐరోపా దేశాల నుంచి మధ్య ప్రాచ్య దేశాలకు పాకిన వైరస్, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ  

తేనెలో (Honey)కొద్దిగా పాలు, ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంగా రాసుకోవాలి. దీనివల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం తాజాగా మారుతుంది. బంగాళదుంపలను (potato) సన్నగా తరిగి జ్యూస్ చేసుకోవాలి. దూదిని ఓ బంతిలా చేసి ఆ జ్యూస్‌లో ముంచాలి. కళ్లు మూసుకొని కాటన్ బాల్స్‌ను కళ్ల మీద ఉంచుకోవాలి. ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.

Monkeypox Outbreak: కరోనా తర్వాత వణికిస్తున్న మరో వైరస్, మరోసారి 21 రోజులు హోం క్వారంటైన్‌లోకి ప్రజలు, మంకిపాక్స్‌ బాధితులకు క్వారంటైన్‌ అమలుచేస్తున్న తొలి దేశంగా బ్రెజిల్  

రాత్రిళ్లు బాదం నూనెను (Badam oil) ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఆల్మాండ్ ఆయిల్‌ను నల్లటి వలయాలపై రాసి మెల్లగా మసాజ్ చేయాలి. రాత్రి పూట రాసి ఉదయాన్నే నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల కళ్లజోడు పెట్టుకున్న ప్రాంతంలో ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.

వీటన్నింటితో పాటూ మన ఇంట్లో దొరికే మరికొన్ని వస్తువులతో కూడా కళ్లకింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ ను (dark circles ) పోగొట్టుకోవచ్చు. వాటి నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఈ చిట్కాలు ఫాలో అవండి.

టమాటాలు

ఒక టీ స్పూన్ టమాటా జూస్.. నిమ్మరసంతో కలిసి కళ్ల కింద అప్లై చేయండి. పది నిమిషాలు ఉంచుకుని తీసేయండి. ఇలా రెండు సార్లు చేయాలి.

బంగాళదుంప

బంగాళదుంపను గుజ్జుగా చేసుకుని దూది అందులో ముంచి డార్క్ సర్కిల్స్ కవర్ అయ్యేలా ఉంచుకోండి. పది నిమిషాలు అలా ఉంచి చన్నీళ్లతో కడగండి.

కోల్డ్ టీ బ్యాగ్స్

గ్రీన్ టీ బ్యాట్స్ ను వాటర్ లో ముంచి తీసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లబరచండి. వాటిని రెగ్యూలర్ గా కళ్ల మీద పెట్టుకుని పది నిమిషాల సేపు ఉంచుకోండి.

బాదం నూనె

విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఒక్క వారంలోనే మంచి ఫలితాలు ఇస్తుంది. కొద్దిపాటి నూనెను రాసుకుని నైట్ అంతా ఉంచి ఉదయం కడిగితే బెటర్.

చల్లని పాలు

దూదిని తీసుకుని చల్లని పాలలో గానీ, ఐస్ వాటర్ లో కానీ ముంచి కంటిపైన, నల్లని వలయాలు ఉన్న ప్రాంతాన్ని తుడవండి.

కమలా రసం

కమలా పండ్ల రసాన్ని కళ్ల కింద భాగంలో రాసుకోండి.

దోసకాయ

ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన చల్లటి దోసకాయ ముక్కలను రోజుకు ఒక పది నిమిషాలు కళ్ల పైన ఉంచుకుంటే బెస్ట్ ఫీలింగ్ వస్తుంది.

పుదీనా ఆకులు

పుదీనా గుజ్జును నల్లటి వలయాలపై రాసి పది నిమిషాలు పాటు ఉంచండి. ప్రతి రోజూ రాత్రి సమయంలో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు.

రోజ్ వాటర్

రోజ్ వాటర్ ను నల్లటి వలయాలపై రాసి పదిహేను నిమిషాలు పాటు ఉంచండి. ప్రతి రోజూ రాత్రి సమయంలో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు.