Edupayala (Credits: X)

Hyderabad, Oct 7: ఏడుపాయల వనదుర్గా భవానీ మాత (Edupayala Temple) సన్నిధిలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (Dasara Celebrations) నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల15న మొదటి రోజు శరన్నవరాత్రి ఉత్సవాలను అమ్మవారికి పట్టు వస్రాలు సమర్పించి మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేందర్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Boulders on Railway Track: పూణె-ముంబై మార్గంలో రైలు పట్టాలపై బండరాళ్లు పెట్టిన దుండగులు.. గుర్తించి తొలగించిన రైల్వే సిబ్బంది.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!

అమ్మవారు ఏ రోజు ఎలా అంటే?

  • 15న తొలిరోజు శ్రీశైలపుత్రి (బాలా త్రిపుర సుందరి) అవతారంలో దర్శనం
  • రెండో రోజు బ్రహాచారిని (గాయత్రీ దేవి)గా
  • మూడో రోజు చంద్ర గంట (అన్నపూర్ణ) అవతారంలో
  • నాలుగో రోజు కూష్మాండ (వనదుర్గా)గా
  • ఐదో రోజు స్కంద మాత (మహాలక్ష్మి)గా
  • ఆరో రోజు షష్టి కాత్యాయని (సరస్వతిదేవి)గా
  • ఏడో రోజు కాల రాత్రి (దుర్గాదేవి)గా
  • ఎనిమిదో రోజు మహా గౌరీ సిద్ధి రాత్రి (మహిషాసురా మర్ధిని)గా
  • చివరి రోజు 9వ రోజు నవమి, దశమి (విజయదశమి) రాజరాజేశ్వరీదేవీగా దర్శనం ఇవ్వనున్నారు.

Asian Games India Record: ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర.. వంద పతకాలతో సరికొత్త రికార్డు.. మహిళల కబడ్డీ ఫైనల్‌ లో భారత్ చేతిలో చైనీస్‌ జట్టు చిత్తు.. మొత్తంగా భారత్ కు ఏయే పతకాలు ఎన్ని వచ్చాయంటే?