TSRTC Special Buses: కార్తీకమాసంలో టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు
పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతున్నది.
Hyderabad, Nov 11: పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TSRTC) స్పెషల్ బస్సులను (Special Bus) నడుపుతున్నది. ఈ క్రమంలో పవిత్ర కార్తిక మాసాన్ని (Karthika Masam) పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర శివాలయాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరుతాయని చెప్పారు. మళ్లీ దర్శనం అనంతరం సోమవారం రాత్రికి రాజధానికి చేరుకుంటాయని తెలిపారు.
ఏపీలోనూ కూడా..
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పంచారామ క్షేత్రాలకు కూడా బస్సులు నడుపనున్నారు. ఈ బస్సులు కూడా ప్రతి ఆదివారం, పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నాయి. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయి.
(The above story first appeared on LatestLY on Nov 11, 2023 10:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

