Matrimonial Cheating: డాక్టర్లను, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను కోరుకుంటున్న అమ్మాయిలు, ఇదే ఆసరాగా చేసుకొని చెలరేగిపోతున్న ఆన్‌లైన్ మోసగాళ్లు, వారం రోజుల వ్యవధిలో వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు
Matrimonial Relationships - Online Frauds - Representing Image | Photo Credits: Pixabay

Hyderabad, November 26: ఈ కాలంలో అమ్మాయిలు తమ పెళ్లి విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. తాము కోరుకునే లక్షణాలు ఉన్న అబ్బాయి దొరికేంత వరకు వేచి చూస్తున్నారు. ఆ అమ్మాయికి మూడు పదుల వయసు దాటినా, తాను చేసుకోబోయే అబ్బాయి చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో మరియు వేతనం విషయంలో వారికి సరిసమానమైనా లేదా అంతకంటే పైస్థాయిలో ఉండే అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారు తప్ప, ఎక్కడా రాజీపడటం లేదు.  ఇందుకోసం వివిధ మాట్రిమోనియల్ వెబ్ సైట్లలో (Matrimonial Sites) తమ ప్రొఫైల్స్ ఉంచుతున్నారు. ఇదే సమయంలో నకిలీ ప్రొఫైల్స్ (Fake Profiles) కు ఆకర్శితులై వారి చేతిలో దారుణంగా మోసపోతున్నారు. అయితే ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు కూడా మోసపోవడం కలవరపాటుకు గురిచేస్తుంది. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. ఇటీవల కూడా పెళ్లి పేరుతో మోసం చేసిన ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులు వారం క్రితం (నవంబర్ 21న) అరెస్ట్ చేశారు.

ఆ వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్ సాయినాథ్ అనే 20 ఏళ్ల యువకుడు, ఫిజియోథెరపీ కోర్స్ చేస్తున్నాడు. ఇతడు సోషల్ మీడియా ద్వారా ఎవరో ఒక వ్యక్తి ఫోటోలు డౌన్ లోడ్ చేసుకొని, Dr అవినాష్ రెడ్డి, MS (Ortho) పేరుతో ఓ మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఇతడి ప్రొఫైల్‌కు మలేషియాలో ఉద్యోగం చేసే ఒక అమ్మాయి ఆకర్శితురాలై, అతడికి పెళ్లి ప్రపోజల్‌ను పెట్టింది. ఫోన్, వాట్సాప్ నెంబర్ తదితర వివరాలన్నీ ఇచ్చింది. ఇక రోజు సాయినాథ్ ఆ అమ్మాయితో చాటింగ్ చేయడం, తన మొబైల్‌లో వాయిస్ ఛేంజ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకొని, సాయినాథ్ ఒక్కడే డా. అవినాష్ లాగా, అతడి తండ్రి ప్రసాదరెడ్డి లాగా, అతడి చెల్లి లాగా మాట్లాడటం చేస్తూ వచ్చాడు. ఇదంతా నిజమే అని నమ్మి అ అమ్మాయి తన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.

ఆ తర్వాత కొన్ని రోజులకు తన డెబిట్ కార్డ్ డ్యామేజ్ అయింది, స్నేహితుడికి అర్జెంట్‌గా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంది అంటూ, అప్పుగా కొంత డబ్బు కావాలి, వెంటనే తిరిగి చెల్లిస్తాను అంటూ ఆమె వద్ద నుంచి రూ. 2.80 లక్షలు తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా మరింత డబ్బుకోసం ఏవో కారణాలు చెప్తుండటంతో, ఆ అమ్మాయికి అనుమానం వచ్చి నిలదీయడంతో,  ఆ యువతి అంతకుముందు పంపిన ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో పెడతా, ఎప్పుడూ పెళ్లి జరగదు అంటూ  సాయినాథ్ బెదిరింపులకు దిగాడు.  రూ. 51 వేలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ మహిళ

దీంతో దిగ్భ్రాంతికి గురైనా బాధితురాలు మలేషియాలో జాబ్ మానేసి, హైదరాబాద్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు వలవేసి సాయినాథ్‌ను పట్టుకున్నారు. ఈమె ఒక్కర్తేనే కాదు, ఇదే తరహాలో మరికొంత మంది అమ్మాయిలను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.

అలాగే 10 రోజుల కిందట (నవంబర్ 18న) విశాఖపట్నానికి చెందిన వంక కుమార్ అనే 32 ఏళ్ల వ్యక్తి వృత్తిరీత్యా డ్రైవర్. ఇతడు కూడా డాక్టర్ గా చెప్పుకొని కనీసం ఒక 20 మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, వారిని 'అన్ని' రకాలుగా వాడుకోవడం, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం ఆ తర్వాత కనిపించకుండా పోవడం. ఇలా నాలుగేళ్లుగా చేస్తున్న ఇతణ్ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం వైజాగ్ సెంట్రల్ జైలుకు పంపించారు.  నాకెవ్వరు అవసరం లేదు, నా బతుకేదో నేను బతుకుతా, తింటా- పంటా, జీవితాంతం సింగిల్ గానే ఉంటా

ఇలా అమ్మాయిలు కేవలం డిగ్రీలు, ఉద్యోగాలు, వేతనాలే ప్రధానంగా అణ్వేషిస్తున్నారు తప్ప వారిలో నిజమైన వారు ఎవరు, నకిలీ ఎవరు అని గుర్తించలేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈరోజుల్లో హెలో యాప్ , ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఎన్నో మాధ్యమాల ద్వారా ఆ వ్యక్తి నిజంగా ఉన్నాడా, ఎలాంటి వాడు అనేది అంచనా వేయొచ్చు, అలాగే లింక్‌డ్‌ఇన్ లాంటి ప్రొఫెషనల్ వెబ్‌సైట్ల ద్వారా వారి డిగ్రీలు, చేస్తున్న ఉద్యోగం, వారి ఫాలోవర్స్ ఎవరూ అనేది తెలుసుకోవచ్చు.

దేశంలో ఎన్నో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారున్నా, ఎక్కువ మంది అమ్మాయిలు కేవలం డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కోసమే అన్వేషిస్తున్నారని ఓ ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ నివేదిక వెల్లడించింది. గ్లోబలైజేషన్, డిజిటలైజేషన్ జరుగుతున్న కాలంలో వాటి కంటే ఇంకా ఎన్నో మంచి ఉద్యోగాలు ఉన్నప్పటికీ, కేవలం అవగాహనా లోపం కారణంగా మిగతా ఉద్యోగాల స్థాయిని గుర్తించలేకపోతున్నారని పేర్కొంది. అందుకే తమ వెబ్‌సైట్లలో ప్రొఫైల్స్ ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయని పేర్కొంది.