Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్.. హర్షపై బాధితురాలి మరో ఫిర్యాదు.. ఈసారి ఏంటంటే?
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హర్షసాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు.
Hyderabad, Oct 4: ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి (Harsha Sai Case) కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ (Trolling) చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హర్షసాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై పలు స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు.
యూట్యూబర్ హర్షసాయిపై మరో ఫిర్యాదు..
తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు
ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న బాధితురాలు
ట్రోలింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు ఇచ్చిన బాధితురాలు@harshasai_ @CyberCrimesCyb#HarshaSai… pic.twitter.com/Ep9KhyIBmN
— BIG TV Breaking News (@bigtvtelugu) October 4, 2024
ఏమిటీ కేసు?
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హర్షసాయి తనపై లైంగిక దాడికి పాల్పడి, బెదిరింపులకు దిగుతున్నాడని నార్సింగి పోలీసులకు బాధితురాలు ఇటీవలే ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగా, ట్రోలింగ్ వ్యవహారంపై మరో ఫిర్యాదు రావడం గమనార్హం.
మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)
(The above story first appeared on LatestLY on Oct 04, 2024 10:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

