representational image (Photo Credits: Max Pixel)

కామంతో కళ్ళు పోసుకుపోయిన వారికి ప్రపంచంలో ఏం జరుగుతుందో కనిపియదు ఆ మైకంలోనే తప్పులు కూడా చేసేస్తుంటారు. నేరాలు సైతం చేయడం మాత్రం వెనకాడరు. అటువంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. మెల్బోర్న్ లో ఓ జంట కారులో శృంగారం చేస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. ఆ తప్పును కప్పిపుచ్చుకోడానికి తప్పు మీద తప్పు చేస్తూ పలు తప్పులు చేసి పోలీసులకు చిక్కారు.

వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లోని ఫాంనర్ ప్రాంతానికి చెందినటువంటి 27 ఏళ్లు యువకుడు, 23 ఏళ్ల యువతి ఇద్దరూ కలిసి ఓ గోల్ఫ్ కోర్సు సమీపంలో కారులో శృంగారం చేస్తూ పోలీసులకు చిక్కారు. అయితే పోలీసులు కారు దగ్గరకు సమీపించగానే ఇద్దరు ఏమాత్రం సంకోచించకుండా కారును వేగంగా దూసుకెళ్తూ రహదారి పైకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి వేగంగా తోలుకుంటూ దూసుకెళ్లారు. పోలీసులకు చిక్కకుండా చాలా ప్రయత్నాలు చేశారు.

అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు ఎందుకు వచ్చాయి, ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా అధికారులతో సిట్ ఏర్పాటు

దాదాపు మూడు గంటల పాటు పోలీసులు యువతి యువకులు కారు వెంబడించారు. చివరకు ఎట్టకేలకు పోలీసు సిబ్బంది చాకచక్యంగా ఆ కారును బ్లాక్ చేసింది. కారు అత్యధికంగా 250 కిలోమీటర్ల వేగంతో నడిపినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు పలు ట్రాఫిక్ వయలేషన్స్ కి కూడా వాళ్ళిద్దరూ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా పోలీసుల అరెస్టు చేసినప్పుడు, యువతి యువకులు ఇద్దరూ కారులో నగ్నంగా ఉన్న పరిస్థితుల్లో చూసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. చివరికి వారిని కోర్టులో ప్రవేశపెట్టారు కేసు విచారణలో ఉంది.