Newdelhi, July 16: వానలు (Rains) పడాలంటూ గ్రామాల్లో (Villages) కప్పల పెండ్లి చేయటం వినడమే కాదు అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం కూడా. అయితే, యావత్తు మానవాళిని భయపెడుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు కొంతమంది వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ బెంగాల్ లోని బెల్డాంగే మున్సిపాలిటీలో కొంతమంది భూతాపాన్ని తగ్గించేందుకు ఇక్కడి డోలా దక్షిణాపురా ఆలయంలో రెండు చెట్ల మధ్య వివాహాన్ని (Trees Marriage) జరిపించారు. స్థానిక దేవాలయంలో మర్రిచెట్టుకు, రావిచెట్టుకు జరిగిన వివాహ వేడుకకు 3వేల మందికిపైగా జనం బంధువులుగా హాజరయ్యారు.
తొలి ఏకాదశి ఎప్పుడు..? ఉపవాసం, పూజ విధానం ఏమిటి...ఈ రోజు చేయాల్సిన పూజలు ఇవే..
উত্তর দিনাজপুরের হামতাবাদ ব্লক এলাকায় বৈরাগী হরিমন্দির প্রাঙ্গনে আয়োজিত বট এবং পাকুড় গাছের বিয়ে#NorthDinajpur #trees #marriage #celebration #WestBengal #WB #Bengal pic.twitter.com/mRG1teSdOX
— DD Bangla News (@DDBanglaNews) July 13, 2024
భోజనాలు సహా..
మన ఇంట్లో పెండ్లి జరిగితే ఎలా అందంగా తయారవుతామో.. ఈ చెట్ల పెండ్లికి కూడా అంతే అందంగా ఆహుతులు తయారై, కొత్త దుస్తులు వేసుకొని రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, నిజమైన పెళ్లిలాగే, ఈ చెట్లకు కనులపండువగా వివాహాన్ని వారందరూ నిర్వహించటం చూపరులను ఆకట్టుకుంది. భోజనాలు కూడా పెట్టడం కొసమెరుపు.