
Kamareddy, Nov 20: పెళ్లి చేసుకుంటాని నమ్మించాడు, రెండు నెలల పాటు శారీరక సంబంధం పెట్టుకొని చివరకు పెళ్లి మాట ఎత్తగానే మోసం చేశాడు. దీంతో ఆ యువకుని ఇంటి ఎదుట ఓ యువతి ఆందోళనకు దిగింది. రెండు నెలలుగా కాపురం చేసి ఇప్పుడు మరొకరితో పెళ్లికి సిద్దమయ్యాడు.. దీంతో తానకు న్యాయ కావాలని యువతి పోరాటం చేస్తుంది.. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన యువతికి.. గాందారి మండలం సీతాయిపల్లి గ్రామానికి చెందిన యువకుడు నీరడి రవితో పెళ్లి చేయాలని ఇరువురి కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు.. పెద్దల సమక్షంలో పెళ్లి మాటలు జరిగాయి. వధువరులు ఇద్దరూ కూడా పెళ్లికి ఓప్పుకున్నారు. అయితే యువకుని తండ్రి యువకునికి, యువతికి జాతకాలు కుదడం లేదని పెళ్లి క్యాన్సల్ చేసుకున్నారు. అయితే యువకుడు రవి మాత్రం యువతితో మాట్లాడి..మా అమ్మ నాన్నలను ఒప్పిస్తాను నిన్నే పెళ్లి చేసుకుంటాని చెప్పి ఆ యువతిని ప్రేమలో దించాడు. కాగా రవి వృత్తిరీత్యా మహబుబ్ నగర్ జిల్లాలోని ఓ సోలర్ కంపనీలో సుపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. తను పని చేస్తున్న చోటుకు ఆ యువతిని తీసుకుని వెళ్లాడు. రెండు నెలలు కాపురం చేసాడు. కలిసి మెలిసి శారీరకంగా దగ్గరయ్యారు. చివరకు ఇంటికి వెళ్లి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తన స్వగ్రామానికి వచ్చేశాడు. చివరకు మరో అమ్మాయితో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో ఆ యువతి యువకుడి రవి ఇంటి ముందు తల్లితో కలిసి ధర్నాకు దిగింది..
పెద్దలను ఓప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని, రూమ్ లో తన మెడలో తాళి కట్టాడని. రెండు నెలలు కలిసి కాపురం చేసాము. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని, తనను పెళ్లి చేసుకోకుండా.. మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడని యువతి తన ఆవేదనను వ్యక్తం చేసింది. తన కూతురికి న్యాయం చేయాలని యువతి తల్లి కన్నీటి పర్యాంతం అయింది..