Deadbody (Representational Image Credits: Google)

Bhopal, October 23: మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో దారుణం జరిగింది. పక్కింటి దంపతుల (Couple) వివాదంలో (Dispute) తలదూర్చి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఛవాని పత్తర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే... పప్పు అహిర్వార్ అనే వ్యక్తి తన భార్య చికెన్ (Chicken) వండేందుకు నిరాకరించడంతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో సహనం కోల్పోయిన పప్పు అహిర్వార్ భార్యను కొట్టడం ప్రారంభించాడు. ఈ గొడవకు ఇరుగుపొరుగువారు అక్కడ గుమికూడారు. వారిలో బాబు అహిర్వార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. బాబు సహా ఇతరులు ఆ భార్యాభర్తలకు సర్దిచెప్పారు. విషయం అంతటితో సద్దుమణిగిందని అందరూ భావించారు.

పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. స్టేషన్‌లో వందేమాతరం ఆలపిస్తూ మార్చ్‌ ఫాస్ట్.. బీహార్‌లోని సోసరాయ్‌లో ఘటన.. మూడు గంటలపాటు నానా హంగామా చేసిన తాగుబోతు.. కుటుంబ సభ్యులను పిలిపించి నిమ్మరసం ఇచ్చినా లేని ఫలితం.. చివరకు పోలీసులు ఏం చేశారంటే?

కానీ పప్పు అహిర్వార్... బాబు అహిర్వార్ పై కోపం పెంచుకున్నాడు. బాబు అహిర్వార్ ఇంటికి వెళ్లి కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాబు అహిర్వార్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానికులు హమీదియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పప్పు అహిర్వార్ ను అరెస్ట్ చేశారు.