Hyderabad, August 15: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohan lal), సీనియర్ హీరోయిన్ మీనా (Meena) ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. తెలుగు, తమిళం, హిందీలో కూడా ఈ చిత్రం రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. దృశ్యం సహా ఇటీవల విడుదలైన 'దృశ్యం 2' కూడా మంచి విజయం సాధించింది.
దృశ్యం 2కు కొనసాగింపుగా.. మూడో పార్ట్ దృశ్యం 3(Drishyam 3)ను త్వరలో తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇదే ఈ సిరీస్ లో ఆఖరుది అని హింట్ కూడా ఇచ్చారు. మరి చూడాలి.. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి మోహన్ లాల్ ఈసారి ఏం చేయబోతున్నారో..
#Drishyam3 The Conclusion
offical announcement soon#Mohanlal @Mohanlal pic.twitter.com/X8dVERlaTR
— Shivani Singh (@lastshivani) August 13, 2022