Karthikeya2: కొనసాగుతూనే ఉన్న 'కార్తికేయ 2' ప్రభంజనం.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే??

Hyderabad, September 11: నిఖిల్ హీరోగా 'కార్తికేయ 2' సినిమా రూపొందింది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ద్వాపరయుగం నాటి ఒక రహస్యానికి సంబంధించి ఈ కథ నడుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు.  ఈ సినిమా కథ అంతా కూడా శ్రీకృష్ణుడు తిరుగాడిన ద్వారక .. మధుర .. బృందావనం .. గోవర్ధనగిరి వంటి క్షేత్రాలలో జరుగుతుంది.

రెబల్‌ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత, తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కృష్ణంరాజు, విషాదంలో సినీ పరిశ్రమ

తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 రోజులలో 120 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టడం విశేషం. ఇప్పటికీ కూడా ఈ సినిమా 1000కి పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండటం విశేషం. ఈ సినిమా తరువాత ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు, అటు నార్త్ లోను చాలానే సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఒక విశేషమైతే, ఇంకా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ ఉండటం మరో విశేషం. కాగా, జీ5 ఓటీటీలో ఈ నెల 30 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం.