Representational Image (Source: Google)

NewDelhi, October 1: లో దుస్తుల విషయంలోనూ డ్రెస్ కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) చివరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. సిబ్బందికి సరైన వస్త్రధారణ లేకపోవడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా ఆ ప్రభావం ఎయిర్‌లైన్స్ పైనా పడుతోందని పేర్కొన్న సంస్థ.. లో దుస్తుల విషయంలోనూ డ్రెస్ కోడ్ పాటించాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Hyderabad Shooter: ‘హైదరాబాద్ నవాబ్ భాయ్.. వచ్చి మమ్మల్ని కాపాడవయ్యా’.. బీహార్‌లోని ‘వాల్మీకి టైగర్ రిజర్వ్’ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను వణికిస్తున్న పులి.. నెల రోజుల్లో ఐదుగురిని పొట్టన పెట్టుకున్న వైనం.. చేతులెత్తేసిన అధికారులు.. హైదరాబాద్ షార్ప్ షూటర్ నవాబ్‌కు పిలుపు

పీఐఏ ఆదేశాలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా అయితే దుమ్మెత్తి పోసింది. లోదుస్తుల విషయంలో డ్రెస్‌కోడ్ ఏంటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనక్కి తగ్గి పీఐఏ.. తమ ఉద్దేశం అది కాదని, సరైన వస్త్రధారణతో విధులకు హాజరు కావాలన్నదే తమ అభిమతమని పేర్కొంది.