Rajasthan Coronavirus: మహిళకు 31 సార్లు కరోనావైరస్ పాజిటివ్, విస్తుపోతున్న వైద్యులు, రాజస్థాన్‌లోని అప్నాఘర్ ఆశ్రమంలో ఘటన, కడుపు భాగంలో కరోనా వైరస్ ఆనవాళ్లు
కరోనావైరస్ కల్లోలం ఇంకా తగ్గడం లేదు. వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో అది కొంచెం నియంత్రణలోకి వస్తోంది. ప్రజల్లో ఇంతకు ముందు ఉన్న భయకం కూడా కనపడటం లేదు. అయితే కొన్ని చోట్ల కరోనావైరస్ సంబంధించిన విషయాలు కొంచెం కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సంఘటనే రాజస్థాన్ రాష్ట్రం (Rajasthan Coronavirus) లో జరిగింది. రాజస్థాన్ లో ఓ మహిళకు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట.
Jaipur, Jan 23: కరోనావైరస్ కల్లోలం ఇంకా తగ్గడం లేదు. వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో అది కొంచెం నియంత్రణలోకి వస్తోంది. ప్రజల్లో ఇంతకు ముందు ఉన్న భయకం కూడా కనపడటం లేదు. అయితే కొన్ని చోట్ల కరోనావైరస్ సంబంధించిన విషయాలు కొంచెం కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సంఘటనే రాజస్థాన్ రాష్ట్రం (Rajasthan Coronavirus) లో జరిగింది. రాజస్థాన్ లో ఓ మహిళకు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట.
కోవిడ్ పరీక్ష చేసుకున్నా ప్రతిసారి ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ (COVID-19 positive 31 times) అనే వస్తోంది. ఆమెకు వస్తున్న రిపోర్టులు చూసి వైద్యులే నివ్వెరపోతున్నారు. కరోనా లక్షణాలే లేకున్నా ఆమెకు కోవిడ్ పాజిటివ్ వస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఆమె నుంచి నమూనాలు సేకరించి అధ్యయనం చేస్తున్నారు.
వివరాల్లోకెళితే.. రాజస్థాన్‌లోని అప్నాఘర్ ఆశ్రమానికి చెందిన శారదకు కరోనా లక్షణాలు ఏమీ లేవు. అయినా కూడా ఆమెకు కేవలం ఐదు నెలల్లోనే 31 సార్లు కరోనా పాజిటివ్ ( COVID-19 positive) వచ్చింది. ఆమెను భరత్‌పూర్ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. గతేడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యుడు భరద్వాజ్ తెలిపాడు.
అలా ఇప్పటివరకు శారదకు 31 సార్లు కరోనా పరీక్షలు చేయగా.. ప్రతిసారి పాజిటివ్ వచ్చిందని వివరించారు. ప్రారంభంలో ఆమె అస్సలు నిల్చోడానికి కూడా సాధ్యమయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది.
గతంలో ఆమె అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆశ్చర్యంగా ఆమె 7-8 కిలోల బరువు పెరగడం గమనార్హం. తొలిసారి వచ్చిన వైరస్ చికిత్స తీసుకున్నా శరీరంలో ఉంటుందని.. అందువల్లే ఆమెకు తరచూ పాజిటివ్ వచ్చిందని వైద్యులు భావిస్తున్నారు. ఆమె కడుపు భాగంలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉండడంతో ఈ విధంగా జరుగుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి నిర్ధారణ రాలేదు. ఆమె నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 23, 2021 01:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

