
Bangkok, JAN 19: విమానంలో పాము (Snake in Flight) కనిపించింది. ప్రయాణికుల లగేజ్ ఉంచే ఓవర్ హెడ్ క్యాబిన్ పై భాగం వద్ద పాకింది. (snake in plane) ఇది చూసి విమానంలోని ప్రయాణికులు భయాందోళన చెందారు. చివరకు విమాన సిబ్బంది చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యింది. థాయ్‌లాండ్‌లో ఈ సంఘటన జరిగింది. జనవరి 13న ఎయిర్ ఏషియా విమానం బ్యాంకాక్ నుంచి ఫుకెట్‌కు ప్రయాణించింది. విమానం గాలిలో ఉండగా ప్రయాణికుల లగేజ్ ఉంచే ఓవర్ హెడ్ క్యాబిన్ వద్ద పామును ఒక వ్యక్తి గుర్తించాడు. విమాన సిబ్బందికి ఈ విషయం చెప్పాడు. కాగా, విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. పాము ఉన్న వైపు ప్రయాణికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సిబ్బందిలో ఒకరు తొలుత వాటర్ బాటిల్‌లో పామును బంధించేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో చివరకు ప్లాస్టిక్ కవర్‌లో దానిని బంధించాడు.
Passengers on an Air Asia plane flying from #Bangkok to Phuket found a #snake in the cabin crawling along the overhead bin. pic.twitter.com/YrfhDHyuhu
— Arthur Morgan (@ArthurM40330824) January 18, 2024
మరోవైపు ఎయిర్ ఏషియా విమాన సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది. విమానంలో ఇలాంటి సంఘటనలను ఎదుర్కొనేందుకు తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. కాగా, ఆ విమానంలోని ప్రయాణికుల్లో కొందరు దీనిని తమ మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.