Representative image (Photo Credit- Pixabay)

కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు వావి వరసలు లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా పంజాబ్ లోని భటిండాలో ఓ తండ్రి తన సవతి కూతురుపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఒక మహిళకు ఇద్దరు కూతుళ్లున్నారు. భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న ఆమె 2021లో  భటిండాకు చెందిన ఒక వ్యాపారి అమర్ సింగ్ ( పేరు మార్చాం)ని పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికే వివాహం కాగా మొదటి భార్యతో కూడా కాపురం చేస్తున్నాడు. 

రెండో భార్య వద్దకు వచ్చి  వెళ్తుండేవాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో మృగంగా మారిన అమర్ సింగ్ వావి వరుసలు మరచి పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఏడాదిగా ఈవిధంగా కుమార్తెను తల్లి లేని సమయంలో లోబర్చుకుంటూనే ఉన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో లోకం తెలియని ఆ బాలిక ఎవరికి చెప్పకుండా తనలో తానే కుమిలిపోయేది.

అయితే గతవారం బాలిక ఆరోగ్యం బాలేదని ఆసుపత్రికి తీసుకెళ్లారు ఐతే ఆ బాలిక గర్భవతి అని తేలటంతో తల్లి ఆశ్చర్యపోయింది. దానికి కారణం ఎవరిని కూతురిని విచారించగా సవతి తండ్రి అమర్ సింగ్  తన తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాలిక వాపోయింది దీంతో తల్లి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.