భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల‍్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్‌’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌ (Allu arjun) సొంతం చేసుకున్నారు.

ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు స్టైలిష్ స్టార్ కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కించుకొని దుమ్మురేపాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రాగా, పుష్ప సినిమాకు రెండు వచ్చాయి.

తెలుగు సినిమాలకు వచ్చిన మరిన్ని అవార్డులు

► ఉత్తమ చిత్రం - ఉప్పెన

► ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ) - కింగ్‌ సాల్మన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

► ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్‌ రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

► ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ - వి.శ్రీనివాస్‌ మోహన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

► ఉత్తమ లిరిక్స్‌- చంద్రబోస్‌ (ధమ్‌ ధమా ధమ్‌- కొండపొలం)

► ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌(సాంగ్స్‌) - దేవి శ్రీప్రసాద్‌ (పుష్ప 1)

► ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బ్యాగ్రౌండ్‌ స్కోర్‌) - ఎమ్‌ఎమ్‌ కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)

► ఉత్తమ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్‌ఆర్‌ఆర్‌)

► ఉత్తమ నటుడు - అల్లు అర్జున్‌ (పుష్ప 1)

► బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ప్రొవైడింగ్‌ వోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ - ఆర్‌ఆర్‌ఆర్‌

► బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు

RRR (Photo-Video Grab)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)