సాధారణ వ్యక్తిలా పోలింగ్‌ కేంద్రానికి విజయ్‌ సైకిల్‌ మీద వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే హీరో విజయ్‌ తన ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయడంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరో విజయ్‌ బిల్డప్‌ కోసమే సైకిల్‌పై వచ్చాడంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు.

అయితే విజయ్‌ సైకిల్‌ మీద రావడనికి కారణం ఇదే అంటూ ఆయన సోషల్‌ మీడియా టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తలాపతి విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేయడానికి కారణం ఉంది. పోలింగ్‌ బూత్ తన ఇంటి వెనుక వీధిలో ఉంది. అది ఒక ఇరుకైన వీధి, కారును అక్కడికి తీసుకెళ్లడం కష్టం. అందుకే ఆయన సైకిల్‌పై పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారని, దీనికి వేరే కారణం లేదని విజయ్‌ సోషల్‌ మీడియా టీం పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)