ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌లు వివాహ బంధంతో ఒక్కటై రెండు నెలలకుపైగా అవుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని అలియా భట్‌ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆస్పత్రిలో స్కానింగ్‌ చేసుకున్న ఫొటోలను అలియా తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. త్వరలో పాపాయి రాబోతున్నట్లు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అలియాకు ప్రెగ్నెన్సీ కావడంతో సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)