బాలీవుడ్ నటుడు అరుణ్ వర్మ అనారోగ్యంతో కన్నుమూశారు. సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'కిక్', 'ముజే షాదీ కరోగే' చిత్రాల్లో నటించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో భోపాల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం(జనవరి 20న) కిడ్నీ ఫెయిలవడంతో తుది శ్వాస విడిచారని అరుణ్ బంధువు మీడియాకు వెల్లడించాడు.
మొదట అతడి బ్రెయిన్‌లో కొంతభాగం పని చేయడం ఆగిపోయిందని, తర్వాత శరీరంలోని ఇతర భాగాలు పనిచేయకుండా పోగా ఊపిరితిత్తులు, కిడ్నీ ఫెయిలవడంతో ఆయన ప్రాణాలు విడిచారని చెప్పుకొచ్చాడు. కాగా అరుణ్ వర్మ సన్నీడియోల్ నటించిన 'డాకిట్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. నాయక్, ప్రేమ గ్రంథ్, కల్నాయక్, హీరోపంతి వంటి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్, రిషి కపూర్ వంటి బడా హీరోల పక్కన నటించారు.
Reportedly, Arun Verma had a block in his brain and eventually, his organs failed to function including his lungs. Know more in the link https://t.co/zqHisWJVI7
— ETimes (@etimes) January 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)