‘బలగం’ (Balagam)లో సర్పంచి పాత్ర పోషించిన కీసరి నర్సింగం మంగళవారం మరణించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు నటుడు, ఆ చిత్ర దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi). ఈ సినిమా కథ కోసం రీసెర్చ్ చేస్తున్న సమయంలో ముందుగా నర్సింగంనే కలిశానని గుర్తుచేసుకున్నారు. ‘‘మీ చివరి రోజుల్లో ‘బలగం’ సినిమా ద్వారా మీలోని నటుణ్ని చూసుకుని.. మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నా’’ అని వేణు పేర్కొన్నారు.అనారోగ్యం కారణంగానే నర్సింగం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
Here's Venu Tweet
నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి 🙏
మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి🙏
బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం..🙏 pic.twitter.com/smDHR8ULyU
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) September 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)