చిరంజీవిపై అభిమానులు సరికొత్తగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌లో ఆయన చిత్రాన్ని గీసి మెగాస్టార్ పట్ల తమకున్న అభిమానం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.మెగాస్టార్‌ ముఖాకృతిని పోలేలా గూగుల్ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు.

మొత్తం 800 కిలోమీటర్ల చెక్‌ పాయింట్స్‌ పెట్టుకుని జీపీఎస్‌ నావిగేషన్‌తో వాటిని కలుపుతూ చిరు బొమ్మను గూగుల్‌ మ్యాప్స్‌పై కనిపించేలా చేశారు. దీన్ని పర్ఫెక్ట్‌గా జీపీఎస్‌ వర్చువల్‌గా గీశారు. ఈ ఫీట్‌ కోసం 15 రోజులు గ్రౌండ్‌ వర్క్‌ చేసి మరీ చిరంజీవికి ‍అద్భుత కానుకనిచ్చారు. ఇటీవల మెగాస్టార్‌ అభిమానులు ఏకంగా 126 అడుగుల భారీ కటౌట్‌ను సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే!

Bhola Shankar Chiranjeevi in Google Map (photo-Twitter)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)