హీరోయిన్ బిపాషా తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఆమె గర్భవతి అయినట్లు వార్తలు వినిపించగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో అందరిలో సందేహాలు నెలకొనగా ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ బిపాషా అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి బేబీబంప్‌తో ఫోజులు ఇచ్చిన ఫొటోలను షేర్‌ చేస్తూ త్వరలోనే తమ బేబీ రాబోతున్నట్లు వెల్లడించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)